పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

నేకీభవింపక యుండిన నుండవచ్చునుగాని యనేక ముఖ్యాంశములలో వారి యభిప్రాయమును దీసికొనక తప్పదనియును వారిచే జూపఁబడిన మార్గము బుద్ధివైశృంఖల్యమును గలుగ జేసి శుద్ధజ్ఞానమును బెంచుననుటకు సందేహములేదు

మహాభారత రామాయణములలో నున్న విషయముల నాలోచించుటకు ముందీగ్రంథములనుఁ గూర్చిన రెండుసంగతులు విచారణీయములయి యున్నవి. మొదటిది ఈ కథలలో నేది పూర్వ మేది పరము ? రెండవది, ఈ గ్రంథములలో నేది ప్రాచీన మేది నవీనము ? సామాన్యముగ హిందూ గ్రంథకర్తలు రామకథ ప్రాచీనమనియును గురుపాండవకథ నవీనమనియు నభిప్రాయపడుచున్నారు. పాశ్చాత్యపండితుల యభిప్రాయము వీనికి గేవలము విరుద్ధముగానున్నది. మన వేదములలో నర్జున జనమేజయ కురు పాంచాలాది శబ్దములుండుటనుబట్టియు నామ బోధకములగు రామ లక్ష్మణ సుగ్రీవాదిపదములు లేకుండుటను బట్టియు రామకథ భారతకథకింటె నవీనమని కొందరభిప్రాయ పడుచున్నారు. మఱికొందరు రామాయణములో నుదహరింపఁబడిన ధూమ్రాక్ష విరూపాక్ష దేవాంతక నరాంతక వజ్రదంష్ట్రాతికాయ మహాకాయాది శబ్దములు కల్పితములుగ నగపడుటవలనను నితర కారణములవలనను రామకథయంతయును గవికల్పితముగాని యథాభూతార్థమును దెలియఁజేయు