పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

కాలమునకు జాలముందు జరిగె ననుటకు సందేహము లేదు. సమకాలీనములగు విషయములఁగూర్చి వానిని జూచినవారు నట్టివారివలన వినినవారును వ్రాయునపుడుగూడ యథావృత్తముగ వ్రాయుట జరుగదు. కావున సంగతులు జరిగినపిదప జిరకాలమునకు వానినిఁగూర్చి వ్రాయువారు పొరపాటుగ వ్రాయరనుట దురూహ్యము. కనుక పురాణేతిహాసములు సత్యాసత్య మిశ్రకథాపూర్ణములై యున్నవి. చిరకాలమైన పిదప వీనిలో నేవిసత్యమో యేవియసత్యమో నిశ్చయించుట యసాధ్యమగుటచేతను గ్రమముగా నాధునికులలో సంభావ్యా సంభావ్య వివేచన సామర్థ్యము తగ్గుటవలనను నీగ్రంథములలో నున్న సర్వ విషయములను హిందువులు జరిగినవానినిగా నమ్ముచున్నారు.

పురాణములలోనున్న యనేకగాధలలోఁ గొన్ని యర్థవాదములని పూర్వగ్రంథకర్తలు సెప్పినను నేవి యర్థవాదములో యేవి యథావృత్తబోధకములో తెలుపుచుఁ మనవారిలో బూర్వు లెవరును వ్రాసినట్లగపడదు. కనుక మహారాజావారు భారతరామాయణ గ్రంథములను విమర్శించి తెలుగుభాషలో దమ యభిప్రాయమును దెలియజేయువారిలో మొదటివారుగ నున్నారు. ఈ మహాభారత రామాయణ విమర్శములో వివరింపఁబడిన కొన్ని విషయములలోఁ గొందరు మహారాజావారితో