పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ద్రౌపదీదేవి నేకవస్త్రయై యుండఁగా సభలోని కీడ్చికొని వచ్చినవాఁ డితఁడే. ఆపిదప నామెను వస్త్రవిహీనురాలినిగ చేయ నుపక్రమించినవాఁడును నితఁడే. ఈదుష్కార్యమును జేసినందుకు భీముఁ డితనిని దుదను రణభూమియందు నుభయసేనలవారు నచ్చెరు వంది చూచుచు నుండఁగా వక్షస్స్థలమునుఁ జీల్చి గుండెరక్తమును ద్రాగెను అంత హతుఁడాయెను.

17. కర్ణుడు.

ఇతఁడు కుంతీదేవికి వివాహము కాక ముందు బుట్టినవాఁడు. ఇతఁడు జన్మించుటకు నొకవరము గల దఁట. అటుల జన్మించిన వాని నంతఃపురమునందుంచక బహిర్గతుని జేసెను. ఆశిశు వొకసూతకులజాతునికి దొరకగా నతనివలన బెంపఁబడెను. కావున నితఁడు సూతకులస్థుఁ డాయెను. క్షత్రియయోనిజుఁడగుటచేత నస్త్రవిద్యాభ్యాసము దభిరుచిగలవాఁడై మొదట ద్రోణాచార్యునికడ కేగి తన కావిద్యను జెప్పు మనఁగా నా యస్త్రగురుడు సూతకులఁజాతుఁ డని నిరాకరించెను. పిదప బ్రాహ్మణవేషము వేసికొని పరశురాముఁ డనువానియొద్ద కేగి యతనివలన సస్త్రవిద్య నభ్యసించెను. చివరకు వేషధారిగా నుండుట నాగురువు తెలిసికొని కోపించి యావిద్యవలననే యితనికిఁ గీడు గలుగునని వాక్రుచ్చెను. విద్యలను నేర్చికొనువారు