పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

11

ప్రయోగవిధమును నేర్చుకొనివచ్చెనని యున్నది. ఆయస్త్రము నర్జునుఁడు పూర్వ మీశ్వరునివలనఁ బొందియే యున్నాఁడు గదా! తిరుగ నెందుకు వెళ్లవలెను. మహావీరుఁ డగునర్జునుఁడనేకాస్త్ర ప్రయోగములను దెలిసి యీయస్త్రప్రయోగవిధానమునుమాత్రము మరచునా? స్వప్న మందు గైలాసమున కేగుట యెటుల నగును ? కావున నీకథనుఁ గల్పితకథగాఁ దీసికొనవలెను. ఈకథకుఁడు వ్యాసాదిమహర్షులయొక్కయు, బీష్మాదుల యొక్కయు స్తవములచే శ్రీకృష్ణులవారిని బరాత్పరుఁడని తెలిసికొని యుండెను. ఇదిగాక గీతలలో “నాకంటె వేరుదైవము లేదు, ఆయాదేవతల నారాధించుట కంటె నన్నే యారాధింపుమనియు, నాదేవతలద్వారా ఫలమునిచ్చువాఁడను నేనే " యనియు శ్రీకృష్ణులవారు సెల విచ్చియుండుటచేత నద్వైతి యగు నీగ్రంథకర్త మత్సరబుద్ధిచే నాఁటిరాత్రి శ్రీకృష్ణులవారి పాదములయందుఁ బూజింపఁబడినపుష్పములే కైలాసమునం దీశ్వరునిపాదముల యం దుండుట సర్జునుఁడు చూచినట్లు తెలియుట కీకథనుఁ జేర్చెను. దీనివలన శివకేశవుల కభేదమని తోఁచగల దని తలఁచెను. అటుల నభేద ముండిన నుండును గాక. ఇట్టి మత్సరబుద్ధితో నీయసందర్భపుగథను గల్పించుట సరికాదు.

7. సైంధవవధనాఁ డతనినిఁ జంపుట కర్జునునకు శక్యము గాకపోవునవుడు శ్రీస్వామివా రొకమాయాతిమిరమును సూ