పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

బొరపాటుపడి యుండవచ్చును. తననమ్మకమును దృఢపరచుటకుగా బై నాలుగు పురాణముల యందుఁ జెప్పఁబడిన రుక్మిణీ శ్రీకృష్ణులకంటె రాధాగోపాలకృష్ణు లధికులని చెప్పునంతవరకు గథను బోనిచ్చెను. రుక్మిణీదేవియే రాథయని చెప్పుటకు మీ కేమి యాధారము గల దని సభ్యులగు మీరు న న్నడుగ వచ్చును. అనేకశతసంవత్సరములు గడచినపిదప నిప్పటివలె బ్రజలయొక్క యు, దేశముయొక్కయు, చారిత్రము లుంపఁబడకుండినకాలములో ననేకసంగతులు సుతరాము మరచిపోవుటయు జాలవరకు మరచినవిషయములలో నందుకుబదులు క్రొత్తసంగతులు చేర్పఁబడుటయు వాడుకలోఁ గలదు. ఇందుకు దృష్టాంత మే మనిన : మనలోఁ గొంతమంది తప్ప శ్రీజగన్నాధమనఁగ నేమియు దెలియనివారు కలరు. ఆక్షేత్రమునందు శ్రీజగన్నాధుఁడు, సుభద్ర, బలరాముఁడు నను మూడు విగ్రహములు గలవు. మధురలోఁ బుట్టిపెరిగిన శ్రీకృష్ణబలరామ సుభద్రలయొక్క విగ్రహములే యివి యని సాధారణముగ నవివేకవునమ్ముకము గలదు. ఇచ్చట మధురలో సుభద్ర, శ్రీకృష్ణ బలరాములకు జెలియలై యున్నది. జగన్నాధునికి నామె భార్యయై యున్నది. ఇంక మూర్ఖపునమ్మక మే మనిన శ్రీకృష్ణులవారు చెలియలినే జగన్నాధములోఁ భార్యగాఁ బొందెనని యున్నది. ఈకథ మేనమామభార్యయగు రాథకథకంటె