పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

మిక్కిలి యసంగతము గదా! అయితే నటుల కాదు. శ్రీకృష్ణులవారు జన్మించుటకు బూర్వమే యీజగన్నాధక్షేత్రము గలదు. ఇప్పుడు జగన్నాధములోఁ బూజింపఁబడుచుండినవిగ్రహములనే బలరాముఁడు, సర్జనుడుఁను దీర్థయాత్రలకు వెళ్లినప్పు డచ్చోటునకుం బోయి పూజించి రనుసంగతి మనమిప్పుడు చదివి తెలిసికొనఁగలము. అయితే, ఈపొరపాటెటుల సంభవించినదో విచారింతము. తమసంతానములో బిల్లవానికి బురుషదైవనామమును, నాడుపిల్లకు స్త్రీదేవతానామము నుంచుట మనలో నాచారమై యున్నది. ఇందుకు నిదర్శన మే మనిన : శ్రీసీతారామనామములలో నొకని కుమారునికి రామనామమును, గుమార్తెకు సీతానామము నుంచుట గలదు గదా! ఆ మొదటి సీతారాములు భార్యాభర్తలై యుండినను వారిపేళ్లను ధరించిన యీబిడ్డలిద్దరు సోదరీసోదరులయి యున్నారు. ఈవిధముగనె వారిజననీజనకులు తమబిడ్డలకు జగన్నాథములోఁ బూజింపఁ బడుచుండు శ్రీకృష్ణబలరామసుభద్రలయొక్క నామముల నుంచియుందురు. శ్రీకృష్ణులవారు తన చెలియలను భార్యనుగాఁ జేసికొనె ననునమ్మక మెంత లజ్జాకరమైనటువంటియు, బావహేతువై నటువంటి తప్పై యున్నదో మీకే విదిత మగుమ. ఈవిధముగనె బ్రహ్మవైవర్తపురాణకర్త రాథ యనునామము గల మరియొకస్త్రీని లక్ష్మీ యనురాథకు