పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

నీతివిషయకగాధలను నిజములగు వానిగ నమ్మియున్నవారు. కావున భీష్ముం డక్కాలపువారిలో వాడుకలో నుండు ననేక ధర్మములను నీతులను గాధలను మతసంప్రదాయములు మొదలగువానినిఁ జక్కగ నేఱిఁగినవాఁ డగుటచేత నతనివలననే ధర్మరాజుయొక్క మనఃకల్మషమును శ్రీస్వామివారు తీర్పించిరి. ఆపిదప గొన్నిదినములవరకు హస్తినాపురముననుండి మరల ద్వారక కేగి ధర్మరాజు చేయునశ్వమేధయాగమునకు గుటుంబసహితముగ వచ్చి యాగానంతరమున దిరుగ ద్వారకకు దయచేసిరి. శ్రీస్వామివారు ద్వారకలో ననేకసంవత్సరములు విజయముచేసి తమవలన నీలోకమునకు గావలసినపనులను నెరవేర్చి తుద నుధ్ధవునకు బరమార్థోపదేశము జేసి బలరామసహితులయి వైకుంఠలోకమునకు దయచేసిరి.

ఈస్వామివారి యనుమతిని బురస్కరించుకొని వ్యాసులవా రప్పటికి ఖలమై సంకీర్ణములయి యున్న వేదములను వేరు పరచి రనియు బ్రహ్మసూత్రములను జేసి రనియు నిప్పటిగ్రంథకర్తలు కొందరు చెప్పుచున్నారు.

వ్యాసుఁడు శ్రీకృష్ణులవారికాలమునాటివాఁడే కదా? శ్రీస్వామివా రవతరించుటకు దుష్టనిగ్రహమే గాక యిట్టి కార్యములు చేయుపనియుఁగూడఁ గలదు. వారు క్షత్రియులు గావున బ్రాహ్మణుడును ఋషియు నగు నీవ్యాసునిచే నిట్లు చేయించి