పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

యుండఁగూడదని నిర్మలమైన నదీతీరమునకు పాండవులను దీసికొనిపోయి యుందురు. ఆపిదప యుద్ధానంతరకథ యశ్వత్థామాదులచరిత్రములలో వ్రాయఁబడి యున్న ది.

పిమ్మట శ్రీస్వామివారు ధర్మరాజునకు స్వయముగ రాజ్యాభిషేకమును జేసిరి. ఇట్లు పట్టాభిషిక్తుఁ డయ్యును ననేకులగు తనవారు యుద్ధమునందు మృతు లయినందుకు వగచుచున్నందున శ్రీస్వామివారు సోదరయుక్తముగ నతనిని భీష్ముని పాలికిం బిలుచుకొనిపోయి యాకురువృద్ధువలన ననేకధర్మములను జెప్పించి మనఃకల్మషమును బోవునట్లు చేసిరి. అయితే సర్వము దెలిసిన శ్రీస్వామివారు తాము స్వయముగ ధర్మోపదేశము జేయక భీష్మునిచే ధర్మరాజునకు ధర్మాధర్మముల నేల చెప్పించిరో విచారింపవలసి యున్నది

శ్రీస్వామివారే వానినివివరింపవలసివచ్చినయెడల నాయా విషయములయొక్క నిజస్వరూపములను జెప్పవలసి వచ్చును. అప్పుడు ధర్మరా జతనిస్వభావమునుబట్టి రాజ్యమును విడుచుకొని తపస్సు జేయుటకు బోవును. వ్యాసాదిఋషులచేఁ జెప్పించినను నించుమించుగ నిది యేఫల మగును. కావున నీధర్మరాజు ముందు ప్రజలను శిష్టాచారముచొప్పున వర్ణాశ్రమమత విషయములకు లోబడి పరిపాలనము జేయవలసినవాఁడయి యున్నాఁడు. మరియు జ్ఞానులుగాని ప్రజ లనేకమత సంబంధపు