పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69

వ. అట్లుంగాక.

తే. గీ. చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు
        డడ్డపడి వారితోఁడఁ బోరాడియైన
        బూని యుడుసంగఁ జొరకున్న వానిఁ గ్రూర
        కర్ముఁడని చెప్పుదురు కర్మకాండవిదులు.

వ. కావున నీ రెండుదెఱంగులవారికి శాంతిఁ గావింపం బ్రయత్నంబు సేసెద. ధర్మార్థ సంగతంబులైన మాటలు మంత్రిజన సహితుండైనసుయోధనునకుం జెప్పెదఁ దనకుం బాండు నందనులకు లోకంబులకు హితంబయినవిధంబు వంచనలేక చెప్పెడు నన్నుఁ బాండవులవాఁడని శంకించి యతండు నామాట వినం డయ్యెనేనియు మేల కాకఁ యిట్లు సొచ్చి చెప్పకున్న నన్నదమ్ములు దమలోనం బోరఁ గృష్ణుండు వారింపక యుపేక్షించెఁ దనచేతఁ జక్కంబడదా యని యజ్ఞులైనజను లాడుదు రెల్లభంగులఁ గార్యం బార్యు లియ్యకొనం జెప్పుదు. ధార్తరాష్ట్రులుం దమకుఁ బ్రదుకుఁ దెరువైన నాపలుకులు పట్టుదురు. పట్టక నీతలంచినచందంబునందులువలై కలంగఁబారిన వారు నాముందర నిలువంజాలుదురే" యని పలికి విదురుని సమ్మతింపం జేసిరి.

అర్జునునకు విదురునకు శ్రీస్వామివా రొసఁగినయుత్తరములనుబట్టి విమర్శింపఁగా దైవ మె ట్లుండినను బౌరుషము