పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ముఖ్యమైనట్లును నాపురుషప్రయత్నము మంచిదైనపు డీజన్మ యందు గార్యకారి కాకపోయినను ముందుజన్మమున నైన నందలిఫలమును గలిగింపకపోదనియు గ్రహింపవలెను. అట్టిపౌరుషమును సర్వేశ్వరుఁడే చేయఁబూనినపుడు మనుజమాత్రుల కది యావశ్యకము గాకపోవునా ? కొంద రవివేకులు దైవమే ప్రధానమని పౌరుషమును జేయక యాజన్మను వ్యర్థముజేయుటయేకాక చెడుదురు. ముక్తికిని పౌరుషమే క్రమక్రమముగా నభివృద్ధియగుసాధనమయి యుండఁగా దైవమే ప్రధాన మనుట యెంత పిచ్చితనము ?

ఇట్లు సంధివాక్యములను శ్రీస్వామివారు సభలోఁ గౌరవులకుఁ జెప్పి బోధపరుచుచుండఁగా నపుడు శ్రీస్వామివారినిఁ బట్టి కట్టుటకు దుర్యోధనాదిదుష్టచతుష్టయము యత్నించుట దెలిసికొని వారు తమవిశ్వరూపమును జూపించిన ట్లున్నది. ఈ విషయమును ముందు చర్చింతుము. అచ్చటినుండి వచ్చి శ్రీస్వామివారు ధర్మరాజుతో సంధి పొసఁగలే దనియు యుద్ధము చేయక తప్పదనియు సెల విచ్చిరి.

యుద్ధభూమియందు బితృపితామహాచార్య భ్రాతృపుత్ర మిత్రాదులను జూచి వారినిఁ జంపుటకు శంకితుఁడై యున్న యర్జునునకు శ్రీస్వామివారు భగవద్గీతలను బోధించిరి. అందుల సంగ్రహము:-