పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

50

160. ఇనుమునకును నూదంటురాతికినిగల సంబంధమే నరునకును , నారాయణునకును గలదు. అటులయ్యును నరుడు నారాయణునిచేత ఆకర్షింపబడడేమి? దుమ్ములోపూడి పడియున్న ఇనుము సూదంటురాతిచేత ఆకర్షింపబడనివడువున మాయచేత దట్టముగకప్పబడియున్న నరుఁడు నారాయణుని చేత ఆకర్షింపబడుటలేదు. నీటితోకడిగి దుమ్మునుతొలగించిన యెడల ఇనుమునకు ఆఠంకముతీరి సూదంటురాతిచేతఆకర్షింపబడును. అటులనే నరుని ఇహాలోకమున నంటిపట్టియుంచు మాయామలమును పశ్చాత్తాపముతోగూడిన ప్రార్థనలచే పొరలివచ్చు కన్నీటితోకడిగివేసినయెడల అతడు నారాయణునిచేత ఆకర్షింపబడును.

161. బ్రహ్మము అనంతుడు; జీవుడోపరిమేయుడు. ఈపరిమేయుడు అనంతుని యెఱుంగజాలుటెట్లు? అట్టిప్రయత్నము ఉప్పుబొమ్మ సముద్రపులోతును కనుగొనజూచుటను పోలియుండును. ఆప్రయత్నమున ఉప్పుబొమ్మ సముద్రపునీటిలో కఱిగి నాశముచెందును గదా? అటులనే జీవుడుగూడ బ్రహ్మమును పరిశీలించి తెలిసికొనవలయునను ప్రయత్నమున తానుభిన్నమను జ్ఞానమునే కోల్పోయి బ్రహ్మము నందు లయముచెందును.

162. జీవాత్మపరమాత్మల ఐక్యత గడియారమునందలి చిన్నముల్లును, పెద్దముల్లును. గంటకొకతడవ కలియుటవంటిది. ఆరెండును పరస్పరము సంబంధముగలవై, ఒకదానిపై నొకటి ఆధారపడి నడచును. సాధారణముగా వేర్వేఱై