పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

372

ఆదరింపజాలకున్నాను. కావున చక్రవర్తులగు మీసాహాయ్యమునుకోరుట మంచిది అనుకొంటిని" అని తెలిపెను. అటులైనచో తన యుద్దేశమును తెలుపకయే వెడలిపోవచూచుట కారణమేమని అక్బరు అడిగినాడు. ఫకీరిటుల జవాబు చెప్పినాడు:- "మీరలే అల్లానుగురించి ఎక్కువసంపదకొఱకును, అధికారము కొఱకును, రాజ్యముకొఱకును అడిగికొను యాచకులుగానుండుట గ్రహించితిని అంతట నాకిటులతోచినది:- "తానే యాచకుడుగానున్నపురుషుని నేను యాచింపనేల? యాచనచేయక నాకు గడవనేగడవనిచో ఆ అల్లానే యాచించుట మంచిది!"

978. ఒకప్పుడు ఒకనికొడుకు చావునకు సిద్ధముగనుండెను. ఎవరును వానిరోగము మాన్పలేకుండిరి. ఎట్టకేలకొకసాధువు వచ్చి "ఒక్కఉపాయమున్నది. త్రాచుపాము విషముతెచ్చి స్వాతినక్షత్రమునుండి పడిన వర్షబిందువులు కొద్దిగవేసి, మానవునిపుఱ్ఱెలోకలిపి యిచ్చినయెడల నీకుమారుడు బ్రతుకునని" తెలిపెను. వానితండ్రి ఆలోచించి, మరునాడే స్వాతినక్షత్రము ఆకాశమున ఉచ్చస్థానమున నుండునని తెలిసి "ఓదేవా! ఈపరిస్థితులన్నియు కలసివచ్చు నట్లనుగ్రహింపుము. నా పుత్రునిప్రాణము రక్షింపుము" అని ప్రార్థించినాడు. ఎక్కువ ఆతురపాటుతో పరితపించు హృదయముతో నాటిసాయింతనమే బయలుదేఱి స్మశానములన్నియు తిరిగి నరకపాలము కొఱకై వెదుకసాగెను. తుట్టతుదకు ఒక చెట్టుక్రింద పుఱ్ఱెయొకటి పడియుంట కాననయ్యెను. ఆయన దైవ