పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

373

41వ అధ్యాయము.

ప్రార్ధనము చేయుచు కనుపెట్టుకొనియుండెను. ఆకస్మికముగా జల్లువచ్చి కొన్నిచినుకులు పైకితెఱచియున్నపుఱ్ఱెలో పడినవి. ఆయన సంతసించి "ఇదిగో! స్వాతి వర్షజలము నరుని పుఱ్ఱెలోనె లభించినది! అనుకొని, "భగవంతుడా! తక్కినవి కూడ సమకూర్చుము!" అని భక్తిపూర్వకముగ ప్రార్థించుచుండెను. కొలదిసేపటికే ఆపుఱ్ఱె సమీపమునందే ఒకకప్ప కాన్పించగా మరల ప్రార్థనలసాగించినాడు. ఒక త్రాచు సమీపముననున్న గడ్డిలోనుండి బుస్సుమనుచు లేచి కప్పను పట్టుకొనబోయినది. వెంటనే కప్పపుఱ్ఱెమీదుగా దుమికినది. ఆత్రాచుపామువిషము పుఱ్ఱెలో పడినది. అపరిమితమగు కృతజ్ఞత మనస్సున వెల్లివిరియ ఆతండ్రి "ఓదేవదేవా! నీకృపవలన దుర్లభవిషయములన్నియు సాధ్యములైనవి! ఇక నాపుత్రుని జీవములు సురక్షితములు కాగలవు. నేనెఱుగుదును" అనెను. కాబట్టి నేను తెలుపునదేమన, నీయందు నిజమగు గాఢవిశ్వాసమున్న యెడల ఈశ్వరానుగ్రహమువలన సమస్తమును సమకూరగలవు.

979. ఒకానొక దేవతార్చన బ్రాహ్మణుడు ఒకరింట దేవపూజలు చేయుచుండేవాడు. ఆపనిని తన చిన్నకుమారునకు ఒప్పగించి యొకసారి ఆయన గ్రామాంతరముపోయెను. నిత్యనైవేద్యమును దేవునిముందుబెట్టి ఆదేవత దానిని ఆరగించుట కనిపెట్టుమని చెప్పిపోయెను. తండ్రియాజ్ఞచొప్పున పిల్లవాడు నై వేద్యమును విగ్రహముముందుపెట్టి మౌనముతో వేచియుండెను. కాని ఆవిగ్రహము తిననుతినదు; మాటా