పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

350

అంతటినుండి ఆమెయు, ఆమెనుబోలు స్త్రీజనమును తనకు తల్లులని చాటినాడు. వెంటనే గృహమునువిడిచి పర్విడిపోయి తిరిగి కాన్పించడయ్యెను.

957. ఒకడు తన యిరువురు కుమారులను దీసికొని పొలములోగుండ పోవుచుండెను. ఒక బాలుని చంకనెత్తికొనినాడు; రెండవవాడు తండ్రిచేతిని పట్టుకొని నడచుచున్నాడు.

గరుడ పక్షి యొకటి వారికి కానవచ్చినది. తండ్రి చేయిబట్టుకొని నడుచు బాలుడు తనపట్టువిడిచి చేతులుచఱచుచు ఆనందముతో నాన్నా! నాన్నా! అదిగో గరుత్మంతుడు వచ్చినాడు! అనికేక లిడసాగెను. ఇంతలో తడబడి పడిపోయెను; దెబ్బలు తగిలినవి. తండ్రియొడిలోని బాలుడును ఆనందముతో చప్పట్లు కొట్టినాడు; కాని పడలేదు. తండ్రి వానిని పట్టుకొనియే యున్నాడుగా! మొదటి బాలుడు ఆథ్యాత్మసాధనలందు స్వయంసాహాయ్యమును నమ్ముకొనినవాని వంటివాడు; రెండవ యతడు దేవునికి ఆత్మార్పణముచేసికొనిన భక్తునిబోలువాడు.

958. ఒకడు నూయిత్రవ్వ నారభించినాడు. అయిదారు బారలలోతు త్రవ్వినీరుగానకఆతావునువిడిచి వేసి వేఱొకతావు నిర్ణయించినాడు. అక్కడ యింకను లోతుగ త్రవ్వినాడు; నీళ్ళుపడలేదు. కావున మఱొకచోటున యింకను లోతుగ త్రవ్వించినాడుగాని ఫలములేకపోయినది. తుదకు వేసరి ఆపనినేవిడిచివేసినాడు. ఈమూడునూతులలోతును కలిపిననూరు