పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

349

41వ అధ్యాయము.

పగులకొట్టుకొని వచ్చునటుచేసినాడు!"

అర్జు:- "నాల్గవవారెవరు?"

బ్రాహ్మ:- "ఉన్నాడొక ఖలుడు, అర్జునుడు."

అర్జు:- "ఏమి? అతడేమిపాపముచేసినాడు?"

బ్రాహ్మ:- "వాని అదరుపాటుకాల, నాస్వామిని తీసికొనిపోయి కురుక్షేత్రరణములో తనకైబండితోలు నీచపుపని యందు నియోగించినాడు."

అర్జునుడు ఆబ్రాహ్మణుని భక్తిఎంతగాఢమైనదో తెలిసి నివ్వెఱపోయినాడు. ఆక్షణమునుండి వానిగర్వము అదృశ్యమైనది; తానే స్వామిభక్తులలో మేటిననుకొనుట మానినాడు.

956. వైరాగ్యమును నేర్చుటయెట్లు?:- ఒకానొకపురుషునితో భార్య "నాధా! నాకు నాఅన్నను చూడగా చాల దిగులు కలుగుచున్నది. వారముదినములనుండి సన్యాసమును దీసికొనవలయునని చూచుచున్నాడు; అందుకై ప్రయత్నములును చేయుచున్నాడు. క్రమక్రమముగా తన కోరికలను అవసరాలను తగ్గించి వేయుచున్నాడు!" అనెను. భర్త యిట్లనెను:- "ప్రేయసీ! నీఅన్ననుగూర్చి నీకు దిగులే అవసరములేదు. అతడెన్నడును సన్యాసి కాబోడు. ఆరీతిగా నెవడును సన్యాసి కాజాలడు." ఈపలుకువిని "ఇంక సన్యాసిఅగు విధమేది?" అని భార్య అడిగినది. "అది యీవిధాన జరుగవలయును" అనిచెప్పుచు ఆమెభర్త తన వస్త్రములను తటాలున చింపివేసి, ఒక్కటేపేలికనుదీసి గోచిగా ధరించినాడు.