పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

309

40వ అధ్యాయము.

892. మనస్సు రెపరెప కొట్టుకొనుట పూర్తిగమానినప్పుడు శ్వాసనిలిచిపోయి కుంభకముఘటిల్లును. కుంభకము భక్తియోగముద్వారమునను ఘటిల్లును. తీవ్రభక్తిచేతను శ్వాసనిలివిపోవును.

893. నరేంద్రుని ప్రశ్న:- "తంత్రశాస్త్రమున బోధింపబడునటుల స్త్రీలమధ్యనుండిసాగింపబడు ఆత్మసాధనా పద్ధతిని గురించి మీ అభిప్రాయమును సెలవిండు."

శ్రీపరమహంసులవారి ఉత్తరువు:- "వద్దు, అని నిరపాయమైనమార్గములుకావు; చాల దుర్లభమైనవి; అవాంతరములు కల్పించునవి. తంత్రశాస్త్రానుసారము మూడువిధములగు సాధనలుకలవు. వీరుని సాధన, సఖీసాధన, పుత్రభావసాధన. నాది పుత్రభావన. భగవంతునికి మాతృరూపము నారోపించునది. జగజ్జనని ప్రియసఖురాలుగ భావించుకొని సాధనయు మంచిదే. కాని వీరుని సాధన (వీరాచారము) అపాయములతో గూడినది. తనను దివ్యమాత పుత్రునిగా భావనచేసికొనుసాధన చాలనిర్మలమైనది."

894. ఒకభక్తుని ప్రశ్న:- (ఆధ్యాత్మసాధనలకు పూను భర్తనుగురించి) నీవు నన్ను ఉచితవిధిని చూడకున్నచో నేను ఆత్మహత్యచేసికొందును అని భార్యబెదరించినయెడల అతడేమిచేయవలసి యుండును?

శ్రీపరమహంసులవారు :- "అటువంటిభార్యను విడిచివేయవలయును. భగవత్సాక్షాత్కారమునకు అడ్డుపడు పెండ్లమును విడువవలసినదే; ఆమె ఆత్మహత్యచేసికొననీ లేక