పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

278

అగు క్షుద్రమానవులను, అట్టి సమారాధనలందు ఆదరించ దగదుసుడీ!

అటువంటి పాపములు వారు కూర్చుండుస్థలమును సయితము చాలబారల లోతువరకు అపవిత్రము చేయునంత ఘోరములుగా నుండును.

804. పూర్వము కసాయివాడొకడు దూరముననున్న వధశాలకు ఒక ఆవును తోలుకొని పోవుచుండెను. ఆకసాయివాడు దానిని క్రూరముగ చెండాడుటవలన ఆ ఆవు చాలా తిప్పలు పెట్టసాగెను. దానిని తోలుకొనిపోవుట వానికి దుర్లభమైనది. ఇట్లుచాలసేపు శ్రమపడి మధ్యాహ్నవేళకు ఎట్టెటో ఒకగ్రామముచేరినాడు. చాల అలసినవాడై, ఒకధర్మసత్రవునకుబోయి, అచ్చటనొసగబడు సదావ్రతమును పాల్గొనినాడు. అందువలన పొట్టనిండ తృప్తిగాతినినవాడై, సేదదేఱి సులభముగా ఆవును తోలుకొనిపోయి వధశాలకు చేర్చగల్గినాడు. ఆగోవును హత్యచేసినపాపములో కొంతభాగము సదావ్రతమునొసగినవానికిని ప్రాప్తించినది. కాబట్టి అన్నమునుగాని, బిచ్చమునుగాని ఎవరికైనపెట్టి పుణ్యముసంపాదింపనెంచువాడు ఆదానమును పుచ్చుకొనువాడు దుష్టుడును సాపవర్తనుడును కాడుగదా యని వివేకించి చేయుచుండవలయును.

805. ప్ర:- ఈజగత్తు అసత్యమా ?

ఉ:- నీవు బ్రహ్మమును చూడజాలనంతవఱకు నీకు జగము అసత్యమే. ఏలయన, నీవుబ్రహ్మమును చూడజాలవు