పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

277

40వ అధ్యాయము.

800. (కలకత్తాలోని కోటీశ్వరుడగు) యదునాధమల్లికు వంటి శ్రీమంతునిభవనములగురించియు ధనరాసులగురించియు విచారణసేయువారు అనేకులుందురు; కాని వానిని స్వయముగాచూచి వానిపరిచయమును చేసికొనగోరువారు అరుదు. అటులనే వేదాంతగ్రంథముల చదువువారును మతధర్మములగూర్చి ఉపన్యాసములు చేయువారును పెక్కండ్రుందురు. కాని బ్రహ్మమును చూడగోరువారును, సాయుజ్యము బడయుటకై శ్రమదీసికొనువారును చాల కొలదిగనే యుందురు.

801. ఒకనికి న్యాయవాది (ప్లీడరు) కాన్పించగానెవ్యాజ్యములు కోర్టులు తలపునకు వచ్చును. అటులనే సద్భక్తులను చూచినప్పుడు భగవంతుడును పరలోకజీవనమును తలపునకు రాగలవు.

802. బ్రహ్మానందము లభించినప్పుడు దానితోడ మైమఱపు కలుగును. అట్టివాడు కల్లుత్రాగ నవసరములేదు; త్రాగినవానివలెనే కాన్పించును. నను నాదివ్యజనని పాదదర్శనము చేయుసమయమున అయిదుసారాబుడ్లు త్రాగినంత కైపెక్కును. అట్టిస్థితియందు ధారాళముగా తిండినైనతినుటకు వీలుండదు.

803. సమారాధనలని చాలామందినిచేర్చి విందులు చేయుట ఎందులకు? అటులచేయుట సర్వభూతములందును ప్రజ్వలించుచుండు ప్రాణాగ్నియందు ఆహుతులిడుటే అనిగదా మీతలంపు? అట్లయిన దుర్వర్తనులును, నీచ చారిత్రులును