పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39వ అధ్యాయము.

ఈ యుగమునకు తగినమతము

732. ఈకలియుగమునకు నిజముగా తగిన ఆధ్యాత్మిక భక్తిసాధన అల భక్తవత్సలుని నిరంతరనామస్మరణయే!

733. నీకు నిజముగా బ్రహ్మసాక్షాత్కారము కావలయునేని, హరినామస్మరణయందు విశ్వాసముంచి నిత్యానిత్య వివేకముతోవర్తించుము.

734. చేపలనుతినువారు నిరుపయోగమగు తలను తోకను పాఱవేసి, మధ్యమెత్తనిభాగమును తిందురు. అటులనే మన పురాతనస్మృతులందలి విధులను ధర్మములను విచారించునప్పుడు, కాలక్రమమున వచ్చిపడిన కాలుష్యములను తొలగించి, ఇక్కాలమునకు అనుకూలమగు సద్ధర్మములనే అవలబించవలయును.

735. నరుడు కరుణజూపునప్పుడు క్రైస్తవుడుగను, బాహ్యకర్మకలాపములందు పట్టుదలచూపుచో మహమ్మదీయుని వలెను, సర్వభూతసమత్వమును పాటించునప్పుడు హిందువుగను వర్తించవలెను.

736. చేతులతో తాళమువేయుచు హరినామమధురగానము ఉచ్చస్వరముతోచేయుము; నీకు ఏకాగ్రచిత్తమలవడును. చెట్టుక్రిందకూర్చుండి చప్పట్లుకొట్టినయెడల దాని కొమ్మలమీదకూర్చున్న పక్షులు ఎగిరిపోవును. హరినామ