పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

35వ అధ్యాయము.

సంసారుని బుద్ధి కామినీకాంచనభోగముల తగులవడియుండును, ఒక్కొకప్పుడు పారమార్ధిక విచారణకు దిగుచుండును.

666. దమ్ముకొనిన అగ్గిపుడక ఎంతఅదిమిగీసినను మండక పొగవిడును. కాని పొడిగానున్న అగ్గిపుడక తేలికగాగీసినను వెంటనే రగుల్కొనును. ఉత్తమభక్తుని హృదయము ఎండిన అగ్గిపుడకవంటిది. భగవన్నామస్మరణ ఇసుమంతకలిగినను వానిహృదయమునుండి భక్తి ప్రభవించును. లోలత్వమున దమ్ముకొని భోగమునతడిసియున్న గృహస్థునిహృదయము తడిసిననిప్పుపుల్లవలె ప్రబోధమును పొందదు. అట్టివానికి తఱుచుగా ఆత్మప్రబోధము కల్గించినను దివ్యభక్త్యాగ్ని రగులువడనే పడదు.

667. మామిడిపండును దేవునికి అర్పణచేయవచ్చును; లేదా ఏదోవిధముగా వినియోగము చేసికొనవచ్చును; కాని కాకి దానిని ఒక్కసారి పొడిచిన చాలును, అది ఎందుకును కొఱగానిదగును. అది దేవతార్పణకా పనికిరాదు. బ్రాహ్మణునికి దానమీయుటకా కొఱగాదు; మఱియు ఉత్తము లెవరును దానిని తినదగదు. అట్లే బాల బాలికలు వారి హృదయములు నిర్మలములుగ నున్నప్పుడే అనగా వారు భోగవాంఛలచే అపవిత్రులు కాకమునుపే భగవంతుని సేవకు అర్పణ చేయదగుదురు. ఒక్కసారి భోగవాంఛలు వారి మనముల జొచ్చెనా, ఇంద్రియలోలతయను దయ్యము తన క్షుద్రచ్ఛాయలను వారిపై నొక్కసారి ప్రస