పుట:Shodashakumaara-charitramu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

షోడశకుమారచరిత్రము


ఉ.

అంతఁ జిరంటికాజనము లల్లన వచ్చిరి రాజు ముందటం
గ్రంతకు నైనవస్తువులుఁ గాంచనపాత్రలుఁ గొంచు సంతతా
తాంతలతాంతకోరకవిలాసమనోహరపల్లవావళీ
కాంతఫలావలుల్ దనరఁ గామమనోహరవల్లికాకృతిన్.

58


సీ.

ధమ్మిల్లములఁ బువుదండలచెలువంబు
        సూసకప్రభలును సొబగు నొంద
సలికకస్తూరికాతిలకవిభ్రమములు
        గుంతలరోచులుఁ గొమరుమిగుల
రంగార నలఁదిన యంగరాగంబులుఁ
        జీనాంబరంబులుం జెలువుమిగుల
భాసురమోహనాపాంగమరీచులుఁ
        గర్ణభూషణములుం గలసి బెరయ
నంగదీప్తులుఁ దొడవులు ననఁగి పెనఁగి
విదితపార్వతీకల్యాణవిభవవినుత
గానములు కర్ణపర్వము ల్గాఁగ నడచు
పేరటాండ్రయందంబులు బెడఁగుఁజేసె.

59


వ.

ఇవ్విధంబున విభవంబులు మెఱయఁ బురంబుం బ్రవేశించిన వైభవసురేంద్రుం డైన మాళవేంద్రుండు మించిన వేడ్క నెదురు చనుదెంచి తోడ్కొని పోవం దదీయమందిరంబు ప్రవేశించిన యనంతరంబున సప్తజనంబు లయ్యెలనాఁగ వివాహవేదికాతలంబున నునిచి గండవడం బెత్తించి యయ్యెడకు నక్కుమారుం దోడ్కొని యరిగిన.

60


క.

ఉండిరి కాంతయుఁ బతియును
గండవడము మాటునందుఁ గడునింపులతో