పుట:Shodashakumaara-charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

155


గీ.

కన్ను నీరు దుడిచి కన్నియ నూరార్చి
పావజాతి బోటిపాటుఁ జెప్పి
నేడు పెండ్లి యంచు నెమ్మి పుట్టగఁ బల్కి
వాఁడె మనకుఁ జెప్ప వచ్చె ననిన.

53


వ.

ఆనందకందళితమానస యయ్యె నప్పు డమ్మేఖమాలనరేంద్రుండు విభవంబున నక్కమలాననం దోకొని చని.

54


క.

తొడవులు తనులత నునిచినఁ
గడునొప్పయి యుండి తొంటికంటెను రుచితోఁ
బడఁతుకయంగము తొడవులు
తొడవనియెడు పలుకుపలుకుఁ దొడవై మెఱయున్.

55


వ.

ఇవ్విధంబున నచ్చెలు లచ్చెలువకు శృంగారంబు చేసి రయ్యవసరంబున నక్కడ.

56


సీ.

వాహననికురుంబవల్లరీజృంభిత
        కాంచనకింకిణీక్వణనములును
మాణిక్యమండనమండితగాణిక్య
        మంజులమంజీరశింజితమును
వాంశికవైణికవందిబృందానేక
        వేణువీణాస్తుతక్వాణములును
లాసికమోహనలాస్యలీలోచిత
        మర్దళమురజాదిమహితరవముఁ
గర్ణచామరసౌవర్ణకర్ణలలిత
వర్ణకంబళభూషణవ్రాతకలిత
దంతిమంటారవంబులుం దనరుచుండఁ
గదలెఁ బెండిలికొడుకు వేడ్కలు దలిర్ప.

57