పుట:Shodashakumaara-charitramu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

121


క.

ఓహో యి ట్లనఁ దగునే
దేహము వడ నుడుగు సుతుఁడు దీఱినవగ ము
న్మోహమున నిన్నుఁ బంచిన
యాహత్య దొరంగు నయ్య యన్నిభవములన్.

14


ఉ.

ఎవ్వరి నేమి చేసితినొ యేఁ దొలుబామున నాకుమారకుం
డివ్విధిఁ బోయెడుం గొడుక యీజననంబున నింక నేరికిన్
నొవ్వి యొనర్ప నోడుదుఁ దనూజునికై నిను సద్గుణాఢ్యు నే
నెవ్విధిఁ జావఁ బంతు ధన మిచ్చెదఁ గైకొను మన్న నావుడున్.

15


క.

లావును వెరవును గలుగుదు
నేవిజయుఁడ నెల్లకడ నరేంద్రతనయచేఁ
జావక జయింపనోపుదు
నావాక్యము నెమ్మనమున నమ్ముము జననీ.

16


వ.

అని యూఱడం బలికి నాఁటి నిశాసమయంబున రాజకన్యకాసదసంబున కరిగి రత్నదీపప్రఖాశోభితం బైన తదంతరంబున నాకాంత హంసతూలికాతల్పంబున నున్నంత.

17


క.

తొలుకారుమెఱుఁగు కైవడిఁ
బులుకడిగిన మరునిశరము పోలికి సత్యు
జ్జ్వలరత్నపుత్రికాకృతిఁ
బొలఁతుక చనుదెంచె నెరుసు పొంపిరిపోవన్.

18


వ.

అయ్యింతితోడనె ఘోరాకారుం డగు నొక్క రక్కసుం డరుగుదెంచె నయ్యవసరంబున.

19


చ.

జలదము పొంతఁ గ్రొమ్మెఱుఁగుచాడ్పున శైలముఁ జేరియున్న పు
ష్పలతికభంగి రాహుకడఁ జంద్రసముజ్జ్జలలక్ష్మి పోల్కి న