పుట:Shodashakumaara-charitramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

115


క.

ధరణీశ్వరనందన నే
సురరిపుచేఁ బడితి వాఁడు సూకర మై నీ
శరమున నిహతిం బొందెను
వరియింపుము నన్ను ననిన వారని వేడ్కన్.

171


క.

అనుపమ మగునా తొయ్యలి
మనసిజభోగములఁ దేల్చి మచ్చికతో నిం
పెనయఁగ సొవృత్తాంతము
వినిపించుటయుం బ్రమోదవికసితముఖియై.

172


సీ.

కనకరేఖయు దాశకన్యయు నేను జం
        ద్రప్రభారమణి సోదరుల మేము
మునిశాపవశమున మువ్వురమును మర్త్య
        జనిఁ బొందినారము గనకపురముఁ
జూచినమనుజునిం జూచినం గనకరే
        ఖకు దొంటి శాపమోక్షంబు గలుగు
వానిఁబొందఁగ దాశవరతనూజకు నాకు
        మనుజజన్మము మానుననియుఁ గలదు
కనకరేఖయుఁ దనమూర్తి గలసె నిన్నుఁ
బొందెఁ గావున నటు చను నిందుమతియు[1]
నేను నరిగెద మాతొంటిమేని కేము
పొందగల మింక నిను హేమపురము నందు.

173


క.

ఏ నీమేను దొఱఁగిచనఁ
గా నీవును వీఁక వెడలు గహ్వర మాలో

  1. ఇందుమతి బిందుమతి యను రెండురూపములుం గలవు.