పుట:ShivaTandavam.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంగములు[1] గదురఁ బ్రత్యంగంబులునుఁ [2] జెదర
హంగునకు సరిగా నుపాంగంబులునుఁ [3] గుదుర
తత సమత్త్వాదు లంతఃప్రాణదశకంబు[4]
నతి శస్తములగు బాహ్యప్రాణ[5] సప్తకము
ఘంటాసదృక్కంఠ కర్పరము గానంబు
కంఠగాన[6] సమాన కరయుగాభినయమ్ము
కరయుగము కనువైన కనులలో భావమ్ము
చరణములఁ దాళమ్ము చక్షుస్సదృక్షమ్ము
ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగఁ
బరవశత్వమున శ్రీపతియున్‌ జెమర్పంగ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

  1. తల, చేతులు, చంకలు, పార్శ్పనులు, నడుము, పాదములు
  2. మూపులు,భుజములు, వీపు, కడుపు, తొడలు,పిక్కలు
  3. చూపు, రెప్పలు, నల్లగ్రుడ్డు, చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరములు, దంతేములు, నాలుక, గడ్డము, మొగము, శిరస్సు
  4. పడి, నిలకడ, నమత, చపలత్వము, చూపు, శ్రమములేమి, బుద్ధి, శ్రద్ధ, మంచిమాటలు, పాట.
  5. మృదంగము, తాళము, వేణువు, పాట, శ్రుతి, వీణ గజ్జెలు, గాయకుడు
  6. కంఠముచేత గానమును, దానిలోని యర్థమును, హస్తాభినయము చేతను, బావమును, కంఠముచేత గానమును, దానిలోని యర్థమును, హస్తాభినయము చేతను, భావమును గనుల చేతను, లయను పాదముల చేతను జూపింప వలెనని నాట్య చార్య సంకేతము.