పుట:ShivaTandavam.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేమానందము
భూమీతలమున!
పలికెడునవె ప
క్షులు ప్రాఁబలుకులొ!
కల[1] హైమవతీ[2]
విలసన్నూపుర
నినాదములకు
న్ననుకరణంబులొ!

కొమ్మల కానం
దోత్సాహమ్ములు
ముమ్మురముగ మన
ములఁగదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు.

రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును!
హైమవతీ కుసు
మాలంకారము
లందునఁ దానొక
టౌదు నటంచునొ!

  1. అవ్యక్తమధురమైన.
  2. పార్వతీదేవి యొక్క