ఏమానందము భూమీతలమున! శివతాండవమట[1] ! శివలాస్యంబట[2] ! అలలై; బంగరు కలలై, పగడపుఁ బులుఁగులవలె మ బ్బులు విరిసినయవి శివతాండవమట! శివలాస్యంబట! వచ్చిరొయేమొ! వి యచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు శివలాస్యంబట!