పుట:Shathaka-Kavula-Charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః

శుభమస్తు

అవిఘ్నమస్తు.

శతకకవులచరిత్రము.


పండితారాధ్యులు.

సర్వమతములకు ఖండనము లున్నవి. కాని మతమును సంపూర్ణముగ ఖండించువారు వేఱు- అభిప్రాయములలోఁ గొంచెము భేదము లున్నవారు వేఱు. రెండవతరగతివా రున్నమతమునందలి లోపములనే సంస్కరించెదరు. బసవన్న వేదాదరణము లేకుండ, జాతిభేదములులేని వీరశైవమతమును స్థాపించినప్పుడు ద్విజేతరుల కామతము నచ్చినప్పటికిని, బాహ్మణులలోఁ జాలమంది శైవమత ప్రియులు కూడ జాతిని విడనాడి కర్మబాహ్యులై జంగములలోఁ గలసిపోవుట కిష్టపడలేదు. ఆయభిప్రాయమును వెల్లడించి వీరశైవమతమును సంస్కరించుటకుఁ బ్రయత్నించినవాఁడు పండితారాధ్యులు. ఇతఁడు బసవన్న స్థాపించిన వీరశైవమతము నందలిలోపములు — అనఁగా బ్రాహ్మణు లామతములోఁ జేరకుండుట కడ్డముగానున్న రెండుప్రధాన విషయములను సంస్కరించె నని చెప్పవచ్చును. బసవన్న చెప్పినట్లు జాతిని, వేదములను (కర్శలను) నిరాకరింపకుండ నితఁడు వీరశైవము సాంగముగ నంగీకరించె నని చెప్పవచ్చును. ఇతఁడు తనమతవ్యాప్తి కనేక గ్రంథములు రచియించెను. మనకుఁ బస్తుత మిచ్చట ప్రసక్తిగల గ్రంథము "శివతత్త్వసారము.”[1] శివతత్త్వసారము కంద


  1. * ఈగ్రంథ మిటీవల గవర్నమెంటు ఓరియంటలు లైబ్రరీవారు సంపాదింప దానిని శ్రీ కే. వి. లక్ష్మణరావుపంతులుగారు విపులమగుపీఠికతోఁ బరిషత్పత్రికలోఁ బ్రకటించిరి. అందలివిషయము లిందుబాహృతమైనవి.