పుట:Shathaka-Kavula-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxv)


వెలిచేటి జగ్గయ్యపుత్రుడఁగు వేంకటరామప్రధాని తనగ్రంథమున నిట్లు వ్రాసెను.

సీ. మృదువుగా విజయలక్ష్మీ నృసింహవిలాస, మంచితగతని రచించినావు
    పరగవియన్నదీ పరిణయంబనుకావ్య, మొప్పుగా విలసిల్లఁ జెప్పినావు
    వినయంబుతోఁ బంచవింశతిశతకముల్, విరచించి హరికి నర్పించినావు
    భాసురమతిని బాణాసురాయుద్దాది, వెసనాటకములఁ గావించినావు

గీ. సరసుఁడవు నీవె రచియించు సవ్యసాచి, కృష్ణసంవాద మనుమహోత్కృష్టకావ్య
    మొనరమా పేరఁ ఆ గృతియిచ్చి ఘనతిమీర, విస్తరింపుము లోక ప్రశస్తిఁగాను.

(2) శ్రీరాజా గొడే నారాయణగజపతిరాయనింగారిమేనత్త యగుమదిన సుభద్రయ్యమ్మగారు 1781లో జన్మ మొందెను. ఈమె 5, 6 శతకముల రచియించెను.

(3) మండపాకపార్వతీశ్వరశాస్త్రి రమారమి 60, 70 చిన్నగ్రంథములు శతకములవంటివి రచియించెను,

(4) విశాఖపురిమండలము నందలిపాలతేరులో నమలాపురపు సన్యాసి యనునొకకుమ్మరి నూఱుశతకముల వ్రాసెను.

(5) ఏనుఁగు లక్ష్మణకవి మున్నగువారితో సమకాలికుఁ డని చెప్పుచున్నసత్యవోలు జనార్దనామాత్యపుత్రుఁ డగుభగవత్కవి

క. ధీరత శతశతకంబులు, దారావళులు౯ దశావతారావళులు౯
   జారూదాహరణంబులు, శ్రీరాజితదండకములు చెప్పినవాఁడ౯.

అని చెప్పుకొనినాఁడు, ఈతనిరుక్మిణీపరిణయము నందలిపద్యములే “రక్షణపరాయణుండ!నారాయణుండ!" అనుమకుటముకలవి భోజన సమయమున మనవారు చదువుచుందురు.

(6) అంతకంతకు చీపురుపుల్లశతకములు, సోడా బుడ్డిశతకములు కూడ వాడుకలోనికి వచ్చినవి.