పుట:Shathaka-Kavula-Charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

శతకకవులచరిత్రము

(1) స్త్రీధర్మములలో "శ్లో !! కార్యేషుదాసీ, కరణేషుమంత్రీ" అను శ్లోకమునకుఁ దెలుఁగుసేఁత.

కం. పని సేయునెడల దాసియు ! ననుభవమున రంభ మంత్రి యాలోచనలం
     దనభుక్తియెడలఁ దల్లియు ! ననఁ దనకులకాంతయుండ నగురా సుమతీ. 68

(2) భర్తృహరి శ్లోకములకుఁ దెలుఁగుసేఁతలు.

కం. పాలను గలసినజలమును | బాఁ విధంబుననె యుండుఁ బరికింపంగాఁ
     బాలచమి జెఱచుఁ గావున ! బాలనుఁ దగువానిపొందు వలదుర సుమతీ. 75

“యద్దాత్రానిజఫాలపట్టలిఖితమ్ స్తోకంమహాద్వాధనమ్” అను శ్లోకమునకు దెలుఁగు.

కం. పెట్టినదినములలోపల ! నట్టడవులకైన వచ్చు నానార్థములుం
     బెట్టనిదినములఁ గనకపు ! గట్టెక్కిన నేమీలేదు గదరా సుమతీ!! 80

"మేరౌచనాతోధికమ్” అనువఱకుఁ గడపటి పాదమునఁ దెచ్చినాఁడు. "కూడేపశ్యపయోవిధా” మొద లుత్తరార్థము కందపద్యములో నిముడకఁ బోలు విడిచినాఁడు.

కొన్నిపదముల ప్రయోగము విశేషము.

"లావొక్కింతయులేదు” పోతన్నగారు 'బల' మను నర్థమున వాడిరి. ఈకవి "లావుగలవానికంటెను భావింపఁగ నీతీపరుఁడు బలవంతుఁ డగు” నని వ్రాసినాఁడు. గంజాము విశాఖపురి మండలములలో 'లావు అనుశబ్దము "అధిక" మను నర్థమున వాడెదరు. "తీపి మాలావుగావుంది” అనఁగా నధికముగా నున్నదని. ఈ శబ్దమునుబట్టి కవిమండలము నిర్ణయ మగునా ?

క. వీడెము సేయనినోరుదు | జేడెల సుగుణములు మెచ్చిచెప్పనినోరు౯ (2)
   బాడఁగ రానినోరును ! బూడిద కిరవైనపాడుబొందర సుమతీ!! 94 |

ఈ 'బొంద' శబ్దము దూష్యార్థమున గుంటూరు కృష్ణామండలములో వాడెదరు. "ఏందిరా? నీబొంద!” అని వాడుక. ఈ శబ్దమునుబట్టి కవిజన్మస్థాన మూహింప నగునా ?