పుట:Shathaka-Kavula-Charitramu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బద్దెన.

45


వరిపంట లేనియూరు రుద్రభూమివంటి దని నిందించు చున్నాఁ డీతఁడు గుంటూరు మొదలైన మెట్టసీమలవాఁడు కాఁజాలఁ డన నగునా?

ఈక్రిందిరెండు పద్యములును మనవారు వినోదముగఁ జదివి సంతసించి మనప్రభుపుల జీవితములతో, బోల్చుకొందురుగాక!

క. మేలెంచనిమాలిన్యుని, మాలను నగసాలివాని మంగలి హితుఁగా
   నేలిన సంపతిరాజ్యము, నేలఁగలసిపోవుఁగాని నెగడదు సుమతీ. 99.

క. వేదరపుజాతి గానీ, వీసము దాఁజేయనట్టివ్యర్థుఁడు. గానీ
   దాసికొడు కైనఁగానీ, కాసులు గలవాఁడె రాజుగదరా సుమతీ, 103.

కవిరాజు రాజుకంటె నధికుఁ డనుట కీతఁడు రాజుల గోటమీటు వ్రాతలే నిదర్శనములు. కవికిఁ గావలసినది సత్యముకాని ధనము కాదు. సత్యప్రియుఁ డగుసుమతిశతక కర్తసేవ నాశక్తికొలఁది యాతని గ్రంథపఠనముచే నొనరించుకొంటిని. చదివినప్పుడు నాకుఁ దట్టిన యభిప్రాయముల వెల్లడించితిని. ఇందు నాయభిప్రాయములలో దోషము లున్నచో నాయపాండిత్యమే వెల్లడికావలెఁగాని యాంధ్రులకుఁ బూజ్యపదార్థ మగుశతకమునకు గౌరవము తగ్గదు. సుమతిశతకము నందలినీతులు నాంధ్రబాలురు బాలికలు పెద్దలుకూడఁ జదివి, యాచరించి ధన్యు లగుచున్నారు. కాఁగలరు.

క. "పలుదోమి సేయువిడియము, తలఁగడిననాఁటినిద్ర తరుణులయెడలం
    బొలయల్కనాఁటికూటమి, వెలయింతని చెప్పరాదు వినురా సుమతీ!

ఈసుమతిశతకము శ్రీరామస్తుతితో నారంభ మగుటచేతను, విప్రులఁ బూజ్యార్థమున వాడినందునను దీనికర్తృత్వము జైన మునిది కాదని శ్రీ బండారు తమ్మయ్యగారు వ్రాసి యున్నారు. వా రట్లువ్రాయుటకుఁ బూర్వమే నేను జైనముని దని యనుమానించి నది సత్యము కాలేదని పత్రికలోఁ బ్రకటించియుంటిని. ఇప్పటికైన నీతిసారముక్తావళి, సుమతిశతకములఁ జక్కగఁ జదివినవా రవి యేక కర్తృత్వము లని యంగీకరింపఁజాలరు. - ఐనను. వ్యతిరేకసాక్ష్యము