పుట:Shathaka-Kavula-Charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

23

ఇందువలనఁ దనగోత్రము భృంగిరటగోత్ర మని, గురులింగ పుత్రుఁ డని, శివకులమువాఁడని చెప్పుకొనినట్లు కనఁబడును. కాని బ్రాహ్మణులలో నిట్టి గోత్రసూత్రములు, కులములు లేవు. అందు వలన నిందు సోమన్న తాను శివపుత్రుఁడ, శివగోత్రమువాఁడ, శివకులీనుఁడ, నని చెప్పిన భక్తివాక్యములుగా వీనినిఁ దలంపవలసియున్నది. ఏ మనఁగా?

(2) పండితారాధ్యచరిత్రమునం దిట్లు చెప్పుకొనె నని కవుల చరిత్రము నూతనముద్రణము 221 పుటలో నున్నది

"శ్లో!! గురులింగార్యస్య దయాహస్తగర్భ సముద్భవః
      బనవేశస్య తనయః బసవేశ్వర గోత్రకః
      శ్రీమత్పాల్కురికి సోమేశనామాహాం సర్వపిత్తమః
      పండితారాధ్య చరితాలంకృతాం కృషిమారభే
      తతశ్శ్రుణు నతామాత్య సూరనామాత్య శేఖర!!"

ఇందుఁ దాను గురులింగార్యునిఛాత్రుడఁని, బసవేశపుత్రుఁడ నని చెప్పుకొనినట్లు శ్రీపంతులుగారు భావించి మొదటికులగోత్ర వివరణమునకు భారతపద్యము నుదాహరించి గురువును జనకునిగాఁ గవి చెప్పఁజూచె నని సమర్థింపఁ బోయిరి. కాని యిందును సోమన్న తనకులగోత్రముల సరిగఁ జెప్పలేదు. బసవకులము, బసవగోత్రము ననియే భక్తివాక్యము లనుచున్నట్లు ఛాందసమే కనఁబడుచున్నది. సత్యముకాదు. ఏమనఁగా? కొన్ని పండితారాధ్య చరిత్రముల ప్రతులయం దీతఁడు [1] వీరపోచేశ్వరునికొడుకు నని చెప్పుకొనెను. అదియుగాక.

(3) పాలుకురికి సోమన్న తనబసవపురాణమును గర్ణాటకమునందలి గొబ్బూరగ్రహార జనోత్తముఁ డగుగొబ్బూరి సంగనామాత్యు

  1. ఆంధ్రులచరిత్రములో శ్రీవీరభద్రరావుపంతులుగారు కృతిపతి వివరములు కవి కంటఁగట్టిరి. సోమన్న వీరపోచేశ్వరుని కొడు కనిలేదు. కృతిపతి తండ్రి వీరపోలేశ్వరుఁడు.