పుట:Shathaka-Kavula-Charitramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

శతకకవులచరిత్రము

బసవపురాణపద్యకావ్యమునందు సోమనాథునిచరిత్రమును కృతిపతి వర్ణనగా నొనరించి యుండెనుగదా. వీరశైవదీక్షాబోధ రచియించిన పిడుపర్తి బనవన యిట్లు సోముని, పండితయ్యను బొగడి యున్నాఁడు.

"సవిశేషశివతత్త్వపారాదికృతుల | శివభక్తి నిష్ఠించి సృష్టికిదృష్ట
 ముగ నిల్వుగన్నులు ముక్కంటిచేత | దగఁ బడసిన పండితస్వామిఁ గొలిచి
 బసవపురాణాదిబహుకృతు ల్జెప్పి ! వసుమతి వీరశైవముఁ బ్రతిష్ఠించి
 సకలమాహేశప్రసన్నతఁ గన్న సుకృతాత్ముఁ బాల్కుర్కి సోమేశుఁ బొగడి
 కావ్యము ల్జెప్పి శంకరు కృపఁగన్న | భవ్యుల శివకవిప్రవరులఁ దలఁచి."

ఇతఁడు ప్రభులింగలీలలు పద్యకావ్యముగ వ్రాసినబసవనకుఁ బూర్యుఁడు. ఈబసవన తనకావ్యము భరద్వాజగోత్రుఁడు, శైవ భక్తుఁడు, వీర బాణావనీనాథునికొడు కగుతిమ్మనృపాలునిపుత్రుఁ డగు వీరభూపాలనకు గృతి నిచ్చెను. ఈకవికొడుకేసోమనాథుఁడు. బసవపురాణము పద్యకావ్యముగ వ్రాయుటయేగాక ప్రభులింగలీలలు కర్ణాటకమునుండి ద్విపదగా భాషాంతరీకరించినాఁడు. "

ఈతఁడు శైవబ్రాహ్మణుఁడు. మొదట నారాధ్యుఁడుగా నుండి యుత్తరవయస్సున కేవలజంగముగా మాఱి సిద్ధిపొందినట్లును, జీవించి యుండఁగనే సమాధి ప్రవేశించి యదృశ్యుఁడైనట్లును భక్తులు వ్రాసి యుండిరి. ఈతఁడు సంస్కృతాంధ్రకర్ణాటక భాషలలోనేగాక మఱికొన్నిభాషలలోఁగూడ పద్యములను వ్రాసెను.

ఈతని వంశమునుగూర్చి యిదివఱ కనేక వివాదము లున్నవి. ఈ క్రిందివాక్యములవలన నీతనితలిదండ్రులనామములే యిదివఱకు సుస్పష్టముగఁ దేలలేదని తెలియఁగలదు.

(1) అనుభవసారమం దిట్లున్నది.

క. భృంగిరిటగోత్రుఁడను గురు | లింగ తనూజుఁడ శివకులీనుఁడ దుర్వ్యా
   సంగ వివర్జితుఁడ ....... | జంగమలింగప్రసాద సత్ప్రాణుండ౯!!