Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శాసనపద్యమంజరి.

32

శ. స. 1150

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 193)

క.

అంబరశరశివసంఖ్యం ద్రి
యంబకవ...లకు దయామతితో నై
తాంబ సరసీపుర ...
దం బమరంగ సంధ్యదీపతతి వెట్టె.

—————

33

శ. స. 1166

ఇది గుంటూరుమండలము బాపట్లతాలూకా కొమ్మూరుగ్రామములో కాశీనాథేశ్వరస్వామి దేవాలయమునం దొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A.R. 826 of 1922)

సీ.

శ్రీయుత మైన కొమ్మురియగస్తేశ[1]
            విభునకు దీపంబు విస్తరిల్ల
నెసగుదీపావలి వసుధలో...౦చ
            నగతీశ్వర[2] స్వామి(క)ర్త్థితోడ
పురుషనిధానుండు సురరాజసద్రిశుండు
            ముత్తియనాయంక్కు పౌత్రుండ...[3]
బలుం డరివీరుల భంజిచి (పే)ర్కొన్న
            నాగినాయకుప్రియనందనుండు
అతులధర్మ్మమూర్త్తి యనుపమ ... తకీర్త్తి
కొండమాంబసుతుండు కో(ర్కి)తోడ

  1. |"శ్రీయుత మగుకొమ్మురీయగస్తీశ్వర(స్త్యేశ్వర)" అని యుండిన ఛందోభంగము కాకుండును.
  2. అగతి అనునది అగస్తికి తద్భవరూపముగా వాడఁబడినది.
  3. యతిభంగ మయినది.