Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన పద్యమంజరి.

25


ప్రోలినాయకుండు వొల్పు(గా) దీపగం
బంబు నిల్పె భువనిం(?) ప్ర(స్తుతి)౦ప.


స్వస్తి శ్రీశకవంబు(లు) 1166 నేంట్టి పౌష్యబహుళ 9 ఆది
వారము నుత్తరాయణసంక్రాంతి నిమిత్యమునం- మొ.

—————

34

శ. స. 1177

ఇది పడమటిగోదావరిజిల్లా నరసాపురముతాలూకా ఆచంటగ్రామములో రామేశ్వరస్వామి యాలయము దక్షిణపుగోడలోఁ గట్టఁబడిన యొకఱాతిమీఁద చెక్కఁబడినది. (A. R. 700 of 1926)

శకవర్షంబులు 1177 గు నేంట్టి ఉత్తరాయణసంక్రాన్తినిమి
త్తమున (ఆసంట్టశ్రీరా)మీశ్వర శ్రీమహాదేవరకు రాజమరాజు ఎఱ్ఱ
లక్ష్మీరాజు వేంగీశ్వరుండు పినలక్ష్మీరాజు ... రును పెట్టిన అంఖండదీపము
నకు......


క.

ఇనశశిదిగ్గజతారక
వననిధికులశైలగగణవసుధాగ్నిసమీ
...కలయంత్తకాలము
వినుతంబై దీప్తి మిగిలి వెలుంగుచునుండును.

—————

35

శ. స. 1264?

ఈశాసనము కర్నూలుజిల్లా త్రిపురాంతకములోని త్రిపురాంతకేశ్వరదేవాలయములోని చీకటిమిద్దె తూరుపుగోడమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 230 of 1905)

సీ.

శ్రీశకరాజ్యాభిషేకవత్సరములు
            జలనిధి(తర్క్కార్క్క)సంఖ్యం బరగం