పుట:Saundarya-Lahari.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

77


చేత, దివసకరనీరాజనవిధిః-దివసకర = సూర్యునికి, నీరాజనవిధిః = ఆరతెత్తుట, సుధాసూతేః = (అమృతవర్షకిరణములుగల) చంద్రునకు, చన్ద్రోపల జలలవైః = చంద్రకాంతపుఱాలయం దూరినయుదకములచేత, అర్ఘ్యరచనా = అర్ఘ్యమిచ్చుట, స్వకీయైః = తనవగు, అమ్భోభిః = ఉదకములచేత, సలిలనిధి సౌహిత్యకరణం = సముద్రుని తృప్తునిఁజేయుట.

తా. ఎల్లలోకములకు తల్లియగునోయంబా! నీవాక్కులచే నిన్నుబొగడుట కొఱవితో సూర్యునివెలిగింపఁజేయుటవంటిది. చంద్రకాంతపుఱాలలో నూరిననీళ్లతో చంద్రున కర్ఘ్యమెత్తుటవంటిది, తనయుదకములచేతనే సముద్రుని తృప్తిపఱచుటవంటిది. స్తోత్రము, స్తోత, స్తోత్రము చేయఁదగినది అన్నియు నీవేయని తాత్పర్యము.


సౌందర్యలహరి

సమాప్తము.



★ ★ ★