పుట:Saundarya-Lahari.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

సౌందర్యలహరి


చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానన్దాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. 99

టీ. హేభగవతి = ఓపార్వతీ, త్వద్భజనవాన్ = నీసేవగలవాఁడు, సరస్వత్యా = సరస్వతి(చదువు)చేతను, లక్ష్మ్యా = లక్ష్మీ(సంపద)చేతను, విధిహరిసపత్నః = బ్రహ్మకును విష్ణువునకును శత్రువుగా, విహరతే = క్రీడించును, (స్వాధీనము చేసికొనినలక్ష్మీ సరస్వతులు గలవాఁడు గనుక వారిభర్తకు కోపము) రమ్యేణ = చూడసొగసైన, వపుషా = శరీరముతోడ, రతేః = రతీదేవియొక్క, పాతివ్రత్యం = (మఱియొకపురుషునిబొందఁ గూడదను) నియమమును, శిథిలయతి = నశింపఁజేయుచున్నాఁడు. చిరం = తడవుగా, జీవన్నేవ = బ్రదికియుండినవాఁడై, క్షపితపశుపాశవ్యతికరః-క్షపిత = విదళింపఁబడిన, పశుపాశ = జీవావిద్యలయొక్క, వ్యతికరః = సంబంధముగలవాఁడై (సదాశివస్వరూపముచేనున్నవాఁడై), పరానందాభిఖ్యం = బ్రహ్మానందమనఁబడు, రసం = సుఖమును, రసయతి = ఆస్వాదించుచున్నాఁడు. ఇట్లు సాదాఖ్యకళ నుపాసించువారికి ఐహికాముష్మికములు రెండును గలవని భావము.

తా. తల్లీ, ఇట్లు నిన్ను (సమయాఖ్యచంద్రకళ) నుపాసించినవాఁడు, లక్ష్మీసరస్వతులకు చోటై బ్రహ్మకు విష్ణువునకు విద్వేషి యగును. జీవావిద్యాసంబంధమును బాపికొని ఎప్పుడును బ్రదికియుండి, పరానందరసమును గ్రోలును.

ప్రదీపజ్వాలాభిర్థివసకరనీరాజనవిధి
స్సుధాసూతేశ్చన్ద్రోపలజలలవైరర్ఘ్యరచనా,
స్వకీయైరమ్భోభిస్సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్. 100

టీ. హేజనని = ఓయంబా, త్వదీయాభిః = నీసంబంధములైన, వాగ్భిః = వాక్కులచేత, తవ = నీయొక్క, వాచాం = వాక్కులయొక్క, ఇయం = ఈ, స్తుతిః = స్తోత్రము, ప్రదీపజ్వాలాభిః = దివిటీలవెలుతురు