పుట:Saundarya-Lahari.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

67


హిమానీహన్తవ్యం హిమగిరినివాసైకచతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ,
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజన్తౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్. 87

టీ. హేజనని = ఓయమ్మా, హిమగిరినివాసైకచతురౌ-హిమగిరి = మంచుకొండయందు, నివాస = ఉండుటయందు, ఏకచతురౌ = మిగుల నేర్పరులైన, నిశి = రాత్రి యందును, చరమభాగేచ = రాత్రి చివరభాగమందును, విశదౌ = నిర్మలములైనవియు, సమయినాం = సమయాచారపరులకు, శ్రియం = సంపదను, అతిసృజన్తౌ = ఇచ్చుచున్న, త్వత్పాదౌ = నీచరణములు, హిమానీ హస్తవ్యమ్-హిమానీ = మంచుగడ్డచేత, హంతవ్యం = నశింపఁజేయఁదగినదియు, నిశాయాం = రాత్రియందు, నిద్రాణం = ముకుళించుచున్న, వరం = కొంచెముగా, లక్ష్మీపాత్రం = లక్ష్మీనివాసమైన, సరోజం = కమలమును, విజయత = జయించుచున్నవి. ఇహ = దీనియందు, కించిత్రం = ఏమి వింత?

తా. తల్లీ, నీపాదములు మంచుకొండయం దుండనేర్చినవై, రాత్రియందును ప్రకాశముగలవై, సమయాచారపరులకు తాము సంపదనిచ్చునవియై, మంచుదగిలిన మాడిపోవునదియు, రాత్రియందు ముకుళించునదియు, కొంచెము కాలము లక్ష్మికి నివాసమైనకమలమును జయించుచున్నవి. దీనిలో నేమిచిత్రము గలదు? ఏమియు లేదు.

పదం తేకీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులామ్,
కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా. 88

టీ. హేదేవి = క్రీడించునిచ్ఛగలయోపార్వతీ, కీర్తీనాం = యశములకు, పదం = నెలవైనదియు, విపదాం =ముప్పులకు, ఆపదం = తావుగాను, తే = నీయొక్క, ప్రపదం = కాలిచివర, సద్భిః = యోగ్యులైనకవులచేత, కఠినకమఠీకర్పర