పుట:Saundarya-Lahari.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

సౌందర్యలహరి


యకలహమందు బ్రతిమాలఁబోయి తానుమాత్రమే అనుభవించి యితరదుర్లభమైనతాఁపు అచేతనమగు వృక్షమునకు కలిగినందున) అత్యన్తం = మిగుల, అసూయతి = కోపపడుచున్నాఁడో.

తా. తల్లీ, తడిలత్తుకతోఁగూడి చక్కగాఁ బ్రకాశించుచు చూడసొబగైనయీనీచరణ ద్వయమునకు మ్రొక్కెదము. దోహదముకొఱకు ఏ పాదములతాఁపును గోరుచున్న క్రీడోద్యానమందలి యశోకమును జూచి శివుఁడు కోపమొందుచున్నాఁడో.

మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే,
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. 86

టీ. హేభగవతి = ఓదేవీ, మృషా = ఆకస్మికముగా, గోత్రస్ఖలనమ్ = (పొరపడి) మాఱు పేరునఁబిలుచుటను, కృత్వా = చేసి, అధ = పిదప, వైలక్ష్యనమితం-వైలక్ష్య = వెల్లఁబాఱుటచే, నమితమ్ = లొంగిన, భర్తారం = మగని(సదాశివుని), తే = నీయొక్క, చరణకమలే = అడుగుఁదామర, లలాటే = నుదుట, తాడయతి = తన్నినదగుచుండఁగా (తనయెదుర తనశత్రువుకు నవమానముగలుగఁగా), చిరాత్ = చాలకాలమునుండి, దహనకృతం-దహన = ఫాలాగ్నిచే, కృతం = చేయఁబడిన, అంతశ్శల్యమ్ = హృదయతాపమును, ఉన్మూలితవతా = మాపుకొనిన, ఈశానరిపుణా = ఈశ్వరునిశత్రువగుమన్మథునిచేత, తులాకోటిక్వాణైః-తులాకోటి = అంచెయొక్క, క్వాణైః = ధ్వనులచేత, కిలికిలితం = కిలకిల నవ్వఁబడెను.

తా. తల్లీ, ఏకాంతమందు నిన్నుసవతి పేరునఁబిలిచిన నీభర్తయగు శివుని నీవు కాలితో ఫాలమునఁ దన్నగాఁ జూచి, మన్మథుఁడు చాలకాలము నుండి ఫాలాగ్ని చేసినయవమానమును బాసి, కాలియందెచప్పుడుచేత నవ్వు