పుట:Saundarya-Lahari.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

65

టీ. హేజనని = ఓతల్లీ, తవ = నీయొక్క, యౌ = ఏ, చరణౌ = పాదములను, శ్రుతీనామ్ = వేదములయొక్క, మూర్ధానః = శిరస్సులు(ఉపనిషత్తులు), శేఖరతయా = శిరోభూషణములుగా, దధతి = ధరించుచున్నవో, హేమాతః = ఓతల్లీ, ఏతౌ = ఈపాదములను, మమాపి = నాయొక్కయు, శిరసి = తలయందు, దయయా = కృపతోడ, ధేహి = ఉంచుము, యయోః = ఏపాదములయొక్క, పాద్యమ్ = కాళ్లుగడుగుటకుఁదగిన, పాథః = ఉదకము, పశుపతిజటాజూటతటినీ-పశుపతి = శివునియొక్క, జటాజూట = కపర్దమందలి, తటినీ = నదియో, యయోః = ఏపాదములయొక్క, లక్షాలక్ష్మీః-లక్షా = లత్తుకయొక్క, లక్ష్మీః = శోభ, అరుణహరిచూడామణిరుచిః-అరుణ = ఎఱ్ఱనైన, హరి = విష్ణువుయొక్క, చూడామణి = తలమానికమగు కౌస్తుభముయొక్క, రుచిః = ఎఱుపో.

తా. తల్లీ, ఏపాదములకొఱకైన నీళ్లే శివునిశిరస్సుననుండునదియో, ఏపాదముల యెఱుపే విష్ణువుతలయందలి కౌస్తుభరత్నముయొక్కరంగో, ఉపనిషత్తులచే వర్ణింపఁబడినయా నీపాదములను నాతలయం దునిచి నన్ను బవిత్రుని చేయుము.

నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయో
స్స్తవాస్మై ద్వన్ద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే,
అసూయత్యత్యన్తం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవనకఙ్కేళితరవే. 85

టీ. హేభగవతి = ఓపార్వతీ, తవ = నీయొక్క, నయనరమణీయాయ = కనులకింపైన, స్ఫుటరుచిరసాలక్తకవతే-స్ఫుట = మెఱయుచున్న, రుచి = కాంతిగలదియు, రసాలక్తకవతే = తడిలత్తుకగల, అస్మై = ఈ, పదయోః = పాదములయొక్క, ద్వన్ద్వాయ = జంటకొఱకు, నమోవాకమ్ = ప్రణామవాక్యమును, బ్రూమః = పలికెదము. పశూనామ్-ఈశానః = పశుపతియగుశివుఁడు, యదభిహనవాయ = దేనితాఁకునకు, స్పృహయతే = కోరుచున్న, ప్రమదవనకఙ్కేళితరవే-ప్రమదవన = ఆటతోఁటయందలి, కఙ్కేళితరవే = అశోకవృక్షముకొఱకు, (ప్రణ