పుట:Satya harishchandriiyamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖడ్గమా! నీ వెంత యపకృతికి బాల్పడుచుంటివి?

 
చ. విడిచితి రాజ్యమైన సరవిం గులకాంతనునైనం గన్న యీ
కొడుకును నైన! నిన్ను ననుజుంగతి జూచితి గాని ఖడ్గమా!
కడ కిటు వల్లకాటి కధికారము వచ్చిన యప్పుడైన నిన్‌
విడువనె యీ కృతజ్ఞతయు వీడి వధింతువె నా సతీమణిన్‌.

ఛీ! ఏమి నా మతి చాంచల్యము? పవిత్రమైన సత్యవ్రత రక్షణార్థము నే నిప్పుడెంత సాహసమైన నాచరింపవలసినదే కావున,

 
సీ. హృదయమా! సతికి నా ఋణమెల్ల సరిపోయె
          నీ కేటియాశ యీ నెలత పైన
మోహమా! నీ కాలము గతించె మా చెంత
          బ్రతుకు మెందేని దంపతుల పొంత
దుఃఖమా! నీ వున్న దొసగు తప్పదు మాకు
          దొలఁగ పొమ్మింక నా తలపు వీడి
ఖడ్గమా! మానినీ కంఠరక్తము గూఁడ
          జవి చూడఁ గలవు నిశ్చలతఁ గొనుము

గీ. సత్యమునకయి యీ హరిశ్చంద్రు వంశ
మంతరించెడు గాక శ్రీ హరుని మీఁద
మనసు గుఱిచేసి, హా! చంద్రమతీ! త్వదీయ
కంఠ మర్పింపు నీ పతి ఖడ్గమునకు.

(అని కత్తి నెత్తగా హఠాత్తుగా విశ్వామిత్రుడు ప్రవేశించి నివారించి)

భళి! భళిరే హరిశ్చంద్రా! చాలుచాలు! నీ సాహసకృత్యంబు. ఛీ! ఛీ! నీవెక్కడనో రాకాసికి జన్మింపవలసినవాడవు. నీ ముఖముఁ జూచినఁ దురితము. విపక్షశిక్షాదక్షంబగు నీ కౌక్షేయము నేటి కీలాటి లతాతన్వుల జంపసిద్ధ పడెఁగా? ఆఱు నెలలు సాముచేసి మూల నున్న ముసలమ్మ నోడించి నట్లు నీ భుజబలం బీలాగుఁ గుసుమ కోమలులం జంపుటకు నక్కఱకు వచ్చెనుగా? నీ కులగురుండగు వసిష్ఠుండు నీకు ధనుర్వేదము నేర్పినదిందులకేనా? జగద్వంద్యమగు సూర్యవంశమున బుట్టి మావంటి వారికెల్లఁ దలవలంపులగు నట్లొక్క చండాలుని దాస్యంబునకుం జొచ్చుట చాల