చెన్న పట్నం,
25
తేటగీ॥! నట్టియీ చెన్న పట్టణాఖ్య పురమందుఁ
జేవ మాజంగ నిప్పుడష్టావధాన
కష్టకృతిఁ జేయఁబూనికిఁ గాన దేవి!
నీ సహాయం బొకించుక నెగడవలయు1
సీ| ఎవనికుశాగ్రబుద్ధిని శేషములు చూడ శతఘంట కవికి నాశ్చర్య మొదవు !
నెవనియుక్తి ప్రయుక్తి విచిత్రములు గన్న దార్కికు డైనఁ దత్తర
ము చెందు | నెవనినిర్మల సౌక్యనివహంబు విన్న చో వైయాకరణులు
వహ్వా యటంచు | రెవనియాదార్యరీతి విని బంగ రు కొండ యెప్పు
డేమొ యని భీతిల్లుచుండు:
తే.గీ॥సట్టి రెంటాలసుబ్బ రాయాభిధాను
సౌధమునఁ బండితావృతసభనుజేయు
బూనితిని దేవి! యష్టావధానకృతిని
నీదుసాహాయ్యమున భవానీ? మదంబ,2
శ్రీ. శ్రీ. శ్రీ.
విజయసంవత్సర పుష్యమాసములో నెల్లూరులో జగిన యష్టావధానము లలోని కొన్ని పద్యములు.
సీసము – ప్రకృతసభ,
చెప్పినతో డ నే తప్పు లేక లిఖించుపండితు లొక వంకఁ బరిడవిల్ల! విధివిరా మము లేక. నేవేగ గంటలఁగొట్టు వారో క్క డ గుల్కుచుండ! సాటినీయ మునందు బహురమ్యముగ మాటలాడువా - రొక్కెడ నలరు చుండ! సరసమౌ రీతినిఁ జదరంగ మాడెడి బుద్ధిమంతులు నొక్క- పొంతదనర;
............................................................................................
ప్రకటన.
అయ్యలారా ! నెల్లూరు హిందూమహా జన సంఘము వారి వలన విజయసంవ్సర॥ పుష్య శు 15 ఆదిత్య నాసరమున పగలు మూడుయామములు మొదలు సాయంతనము దనుక నొకవిద్వత్సభ జరిగించఁబడెను.
అందు గోదావరీ మండలము నుండి విచ్చేసిన యిరువుకు బాలసరస్వతులు నాద గిన పిన్న వయసులో నుండి శ్రీ కింకవీంద్ర ఘటాపంచానన విద్వత్కవి బాలకలానిదులను బిరుదువడసిన బ్రహ్మశ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రులవారిచేతను చెళ్లపిళ్ల వేంకటేశ్వర శాస్త్రులవారిచేతను అష్టావధానము అతివిచిత్రముగఁ జేయింపఁబడెను. అందుఁ జేయఁ బడిన యపథానము లీక్రిందఁ బొందు పఱచ బడుచున్నది,