పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శతావధాన సారము, పూర్వార్థ ము .


తేటగీ! నంబరపురాణకథయు వ్యస్తాక్షరి యును
లౌకికోక్తులు ఒక్కతలమునఁ జెలఁగఁ
దిరుపతియు వేంక టేశుండు సగ సరీతిఁ
జేసి రష్టావధానంబు జెడ్జి చూడ . శ్రీ శ్రీ శ్రీ ... 1

శ్రీ శ్రీ శ్రీ

ఈ పట్టణమందే జిల్లా రిజస్టార్ గుండు వాసు దేవశాస్త్రు లుగారు చేయించిన సభలోనికొన్ని పద్యములు.

(అర్జునుఁడు సుభద్రకరము పట్టుకొనుట. )

సీ కాషాయవస్త్రము గని పాఱిపోకుము నీకై నవేష మోనీరజాక్షి!
పెద్దగడ్డము చూచి బెదరిపోయెదవేల? నీకై న వేష మోనీరజాక్షి
రుద్రాక్షు పూసలు ఱొమొత్తునని పోకు నీకై న వేష మోనీరజూక్షి,
వెలిబూదె యంటునం చులికిపడెద వేల? నీకై నవేష మోనీరజాక్షి .
తే॥॥ యనుచుఁ దనకు మర్జునుఁడదిమి పట్ట
బెద్ద 'లేముందురో! యనుభీతిఁ జేసిఁ
వదలి పో లేక పో లేక వదలి పోవు
చున్న యటు లీ సుభద్ర తా నున్న దహహా1

...........................................................................................................

1. తొమ్మిది మందికి వారువారు కోరుకొనిన వర్ణనలు. వారు వారు కోరుకొనిన శ్లోక పద్యములలో వారు ఏర్పఱచిన నియమముల తోడను తెలుగు సంస్కృతంబునే వారు నిషేధించిన యక్షరములు రాకుండ నవలీలగ నొక్కొక్కయ క్షరమే చెప్పుమనిన వారికీ నొక్కొక్క నక్షరమువంతునను మూడేసి యక్షరములు గోరిన వారికి నట్లేయు ను నొక్కొక్క చరణము చొప్పునఁ గోరిన వారికి నట్లేయును మొదటి చరణము చెప్పు చుండ నంతట నిలిపి, రెండవ మూడవ చరణములలో నొక్కొక్క పదము నడిగిన ను " చెప్పుచును సందులో నడిగిన వారిచ్చిన 'నేదియో మూడక్షరముల పదమునుగూడ గల్పి "చెప్పుడనిన నట్లేయును నొనర్చుచుఁ గవిత్వము చెప్పబడినది.

2. సభికులలో నొకరు ఏదియో యొక జర్మనీ దేశ చారిత్రములోని యొక్క యితిహాసమును జదివి వినిపించిన నద్దానిని మనమందిడికొని తిరుపతి శాస్త్రుల వారు సంస్కృతమున శ్లోక రూపముగ నొక్క పురాణముగా విరచించి రాగయుక్తముగ విని పింపుచుండ వేంకటేశ్వర శాస్త్రులవారిచే నది శ్రావ్యమ్ముగ దానికంతయు రాగయు క్తంబుగ నే యర్థమ్ము పక్కాణింపుచు నా కాశపురాణము చెప్పఁబడెను,

తెలుఁగు, ఆరవము, ఇంగ్లీషు, మొదలగు 'నా నాభాషలలోని పదములు ఇరువది క్రమముతిప్పించి యొక్కొక్క పదమును. దానికి పరుసలో నివ్వబడిన సంఖ్య