పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బందరు

17


సద్ధరావృత్తం.-- కిరసనాయిల్:

నోక్రీణంతుస్మ కేనా తదిహ కిరసనాల్నామకం తైల మేత
ద్యుద్గంధః పైత్య రోగం జనయతి సకృదాస్వాద నా త్బూతిగంధీ
యద్ధూమో నేత్రరోగం జనయతి నితరాం బాల మానుష్యలోకే
ప్యగ్నౌ క్షీప్తం యదిస్యా ద్యదపి జగదిదం భస్మ సా చ్చర్కరీతి.3

సీసము - బ్రాహ్మణులకును - వైశ్యులకుగలిగినక లహము.

గ్రామ పౌరోహిత్య కర్మచే జీవించు వార లెల్లను భాగ్యదూరులైరి.
వ్యవహారధర్మము ల్వదలి కోమటు లెల్లఁ బై తృకాన్నంబుల బలుపు గనిరి
తగ స్వప్న మం దైనఁ దలఁపరానటువంటి బ్రాహ్మణ ద్వేషంబు ప్రబలుచుండె
బ్రాహ్మణ యాచక వ్రాతంబు లెల్లను బ్రాహ్మణయాచక ప్రతిభ గనిరి,

తే.గీ|| కాన భూసుర వైశ్యు లనూనభక్తి
రాగముల నొప్పి వెలయఁగా గా దె! యెందు
కనుపయుక్తవివాచంబు లక్కతమున
సేగియే కాని లబ్ది కించిత్తు లేదు4

సీసము సంధ్యా రాగము.

వారుణీకామినీ ఫాలభాగంబునఁ బొల్పొంచుకుంకుమపూఁత యనఁగ
చక్ర వాకీ మనస్సరసిజంబునఁ బొరఁ బారుసం తాపాగ్ని వార మనఁగ
సస్తాద్రి పై కేగునరుణు 'నడ్డము పెట్టి నేగుపద్మినియను రాగ మనఁగ
కొలమాయూవి చేగాల్చి పెట్టి నగురు స్ఫురదయోమయము లౌకఱకులనఁగ

................................................................................................

ఇయ్యెడ (ఉసౌధ్యాయోపయోగిని) యను పత్రికలో

విద్యావిచిత్రము.

ఈ క్రిందియంశము నాధారము చేసికొని యుపాధ్యాయులందఱును విద్యార్థులకు వి ద్యాప్రభావములను వర్ణించి చెప్పవలయునని కోరుచున్నాము, దివ్యజ్ఞాన సనూజము యొక్క 'హించూ దేశ శాఖకు సహాయ కార్యదర్శియగు సి, డ్నీ, వీ. ఎడ్డీ దొరగారు ఈ నెలలో నిచ్చటికి నచ్చినపు డీకవీశ్వరులయద్భుతశక్తి కానందమునొంది యీసంవ త్సరము డిసెంబరు నెల లో జుగుగఁబోవు దివ్యజ్ఞాన సామాజిక సాంవత్సరికోత్సవమునకుఁ ప్రీతి పూర్వకముగా నాహ్వానము చేసిరని విని యెంతయు సంతసించుచున్నారము .

పత్రికాధిపతి,

క్రిందటి నెలలో 'బాలుఁడైన గణిత శాస్త్రజ్ఞని విషయమునఁ గొంతవాసియు