పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బందరు

15


విజయ సం! శ్రావణ - భాద్రపదమాసములలో బందరులోని యనేక శతావధా నాష్టావధాసములలోని యనేక పద్యములలోఁ గొన్ని పద్యములు,

(మాలిని -- రాబ్రసన్పేట బజారు.)

లలితరుచి వెలుంగున్ రాబ్రసన్పేట, మధ్యస్
జలము గలిగి వాపీ సామ్య రారాజితంబై
జెలఁగు .సరము, కయ్య శ్రీక వస్తు ప్రపంచం
బలవడి కనుదోయింబండువు ల్పండఁజేయున్...........1

సీసము.. పచ్చిమిరపకాయ.

ఎద్దానిసం బంధ మెలమిఁ గల్గిన మాత్రఁగూర లెల్లనుమంచిగుణముగనుమె
కొత్తి మిరీని నూరుకొని తిన్న నెయ్య ది కంచెడన్నము తినఁగలుగఁ జేయు
నిద్దాని శిశుజాల మెఱుఁగక చేఁబట్టి కనులునల్పఁగ మంట గలగఁజేయు
నెద్ది తాఁగ్రమముగా నెదిగిపండిన మీఁదబోటి కెమోవితో సాటియగునొ

....................................................................................................................

బ్రంహశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారును దివాకర్ల తిరుపతి శాస్త్రి గారును విజయ సం॥: ఆషాఢ॥ బగా ఆదివారమురోజున నీ బందరు పురమ్మున జరిగించిన శతావధానంబునను ఆష్టావధానంబునను గొందఱ నేక భంగుల భంగములు కలుగఁ జేసినను బంగము లేమింజేసి వారిపైఁ దాత్పర్య పద్యముల నీ క్రింద నుదా హరించుచున్నాఁడను,

ఉ॥ మాయలు గావు చూడగను మర్మ మొకంచుక గానరా దిదే !
చాయఁ బరీక్ష చేసిననుసభ్యులు కొందఱు సంశయాత్ములై
కాయము వాక్కుఁ జిత్తమును గట్టినిరోధముజేసి సద్గురుం
బాయక 'చెందువిద్య యని పల్మరు నామదిలోఁ దలంచెదన్||

కం! వీరల కవిత్వధారయు, వీర లధారణయు వీరివిద్వద్భావం | బొరయ సుతిపాత్రం
బులు, వేరన నెవఁ డోపు జగతి వివరించిన చోన్ 2 |

చ|| పురుషుఁడు గానిచో యసముఁబొందఁడు సత్సభనంచు నెంచి తా |
సర సిజపాణి శాపద విశాలమనమ్ముననిద్ధరిత్రి నీ |
తిరుపతి వేంకటేశు లను ధీరక వీంద్రులరూప మొంది స |
త్పురుషసభాళుల యళముఁ బొందుచు నున్నదటంచు నెంచెదన్. 3

విధేయుడు చల్లపల్లి రామచంద్రయ్య. (ఆనియున్నది)

శ్లో|| యదసిహి గురువాక్య సక్త చిత్తౌ| తిరుపతి వేంకట శాస్త్రీణౌ వ్యధత్తామ్ త దధిగత కలాకలాప కానాం | హృది విదధీత మహాద్భుతం బుధా నామ్ |1


.