ఈ పుట ఆమోదించబడ్డది
81
శశికళ
శృంగార రసాంచిత విరహోత్కం
ఠాంగహార కరణార్ద్రిత గీతము
ఆ లోలిత రస పరిపుల్లసౌర
భాప్లావిత పరమభావ చలితము
హావీభావ విలసత్కృతాభినయ
హ్లాదము నద్భుతనృత్య మొనర్చితివే !
అటుఖండిత విటువాసక సజ్జిక
వభిసారిక వొక్కసారి ప్రోషిత
భర్తృక వొక్కట కలహాంతరితవు
స్వాధీన పతికవు స్వీయవు ప్రౌఢ
వఖిల రసాధిదేవత వనన్యవు
వాచ్యాభినయ విశారదవతివా !