పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95

శశికళ

             ఓ సఖీ మన ప్రేమ
             వేసటేనట భువికి !

                    ప్రకృతిలో సౌందర్య ప్రత్యక్షదృశ్యాలు
                    వికసితోత్త మకృషులు సకలకావ్యములు కళలు

పరమసృష్ట్యా విర్భవ రసస్వరూపములు
            నరజాతి ప్రగతికవి ఆలంబనోద్దీప
            నాధారములు విమల హృదయస్తితికి కార
            ణాత్మికము లాప్త శక్తీ ప్రపుల్లములు

                    ఓ సఖీ మన ప్రేమ
                    అసాధ్య మీ భువికి !

అమలమౌ ఏదృశ్య
మమృతమౌ ఏఘటన

            కాల్పనిక చిత్రమై శిల్ప విషయముకాదొ !
            అల్పభావము లెట్లు శిల్ప విషయములౌను
            పొడితనము ఉన్నతటె
            జడత సంపన్నతటె

                   ఓ సఖీ మన ప్రేమ
                   ఉత్త మోత్తమ చరిత్రకదవే !