పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
96
 

భౌతికాకర్షణాతీత సంకలనమే
భౌమ్యమౌ తుచ్ఛేంద్రి యాకర్షణాతీత

          రీతియే, ఘటనయే
          ప్రీతియే, ప్రేమయే
          సౌందర్య రూపమ్ము సౌందర్య భావమ్ము !

సౌందర్య సంధాన సందర్శనోద్భవము
ఆనందమో దేవి ! ఆనందమే శక్తి
ఆనందమే ప్రగతికై నరులకిడు రక్తి

         ఓ సఖీ మన ప్రేమ
         ఆసాధ్య మీ భువికి
         ఆనంద సౌందర్య
         ప్రాణమే మనుజునకు !