పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ రంగము

పరమేశ్వరుడు పరమదయాళువు. తెలియక చేసినవారి తప్పులను తప్పక క్షమించును. తప్పులని తెలిసియు మనస్సు త్రిప్పజాలని దానినిగూర్చి మిక్కిలి పశ్చాత్తాపపడును. ఆయన తపులను నిర్భీతిగా ఒప్పుకొనిన వారిని కరుణింవి కడతేర్చును.

ప్రకృత దేశకాలనిమిత్తముల ననుసరించి మనసాంఘిక సమస్యల విషయమై నాపొరబాట్లను సవరించి, క్షమించి న్యాయమార్గమందును, ప్రేమమార్గ మందును, నాకు చక్కని ధైర్యము కలుగ జేయుగాక అని పరమేశ్వరుని ప్రార్దించుచు, ఈవధూవరులతొకూడ నేనును మీకు వందనములర్పించు చున్నాను.

(అనుచు వధూవరులతొడ ఆచార్యులవారు సైతము సభకు సాస్టాంగదండప్రమాణములు చేయుదురు.)

(అందరు"శతమానంభవతి " అని చెప్పుచు ఆశీర్వదింతురు.)

మంగళము

య వ ని క ప డు ను.

సమాప్తము

88