పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యంకము


ప్రా-ఇన్:-రండు యోచింపకుడు. ఉదారమానసమునహింపుడు. ఇందువలన మీకుకలుగబోవు పరిభవము తొలగుటయే గాక సంఘసంస్కరణకార్యమున మీకు ఎనలేని కీర్తికలుగును. తప్పులను ఒప్పులుగా మార్చుటయే ఉత్తమ జీవియొక్క ముఖ్యకర్తవ్యము. (అనిభీమసేనరావును చేయిపట్టి పిలుచుకొనిపోవును.)

(యవనిక పడును)

                 -----

సరిపడని సంగతులు

మూడవయంకము - మూడవ రంగము.

బీమసేనరావుగారిగృహము-వివాహమంటపము.

నాగస్వరము వాయించుచుందురు. బంధువులు, మిత్రులుకూర్చొని యుందురు.

పురోహితుడు లోపలినుండి రాజారావును, తారాబాయిని మంత్రములతో పసుపువస్త్రములతో పిలుచుకొనివచ్చును. అప్పుడు విద్యాలంకారాచార్యుల వారు ప్రవేశించి అందరికి అక్షత లొసగి చేతులుమోడ్చి)

విద్యా:-సోదరసోదరీమణులారా! ఈ వధూవరులను ఆశీర్వదించుటకుముందు నావిన్నపమొకటి సావధానముగా వినవలెను.

ప్రపంచములో తెలియకజేయు దోషములుకొన్ని, తెలిసిచేయు దోషములుకొన్ని, తెలిసియుచేయు దోషములే పాపమము అని అనిపించుకొనును. అట్టిపాపమునకు ముఖ్యముగా భీతియేకారణము. ఆభీతికి అజ్ఞానమే జన్మస్ధానము. అజ్ఞానము దైవభక్తి లేనందుననే కలుగును.

శాస్త్రపాండిత్యముల వలన దైవభక్తి కలుగదు. స్నాన, సంధ్యాద్యమష్ఠానముల వలన దైవభక్తి కలుగదు. జప తపంబులవలన మాత్రమే లాభములేదు. సర్వేశ్వరునకు ప్రీతికలిగించు పనులవల్లనే తప్ప వేరెట్టి యుపాయములనైనను దైవభక్తికలుగదు.

82